twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భరత్ అనే నేను రిలీజ్ డేట్ ఫిక్స్?: వేసవి సెలవులమీదే మహేష్ దృష్టి

    కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది.

    |

    కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కైరా అద్వాని కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ మూవీలో మ‌హేష్ ముఖ్య‌మంత్రిగా కనిపించ‌నున్నాడు. స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను ప్రారంభించాడు మహేష్. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినిమా యూనిట్. ఇందులో మహేష్ బాబు సీఎం గా కనిపించబోతున్నాడన్న విషయమే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెరిగాయి.

     షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో

    షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో

    వచ్చే ఏడాది సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక పెద్ద సినిమాల దృష్టి వేసవి మీద పడింది. నెక్స్ట్ సమ్మర్లో నాలుగైదు భారీ సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. అందులో ముందుగా ‘భరత్ అను నేను'కు ముహూర్తం కుదిరిందట. షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పుకుంది.. తాజాగా వేస‌వి సెల‌వుల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌నున్నారు..

    ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్

    ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్

    ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వారి అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. తాజాగా ‘భరత్ అను నేను'కు సంబంధించి ఓవర్సీస్ థియేటరికల్ రైట్స్ కు సంబంధించిన నంబర్లు వెలుగు చూశాయి. ఏకంగా 18.18 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేటరికల్ రైట్స్ అమ్ముడు బోయాయని సమాచారం. కేవలం ఒక్క తెలుగు వెర్షన్‌లోనే థియేటరికల్ రైట్సే భారీగా అమ్ముడయినట్టు తెలుస్తోంది.

     ఏప్రిల్ 20న రిలీజ్

    ఏప్రిల్ 20న రిలీజ్

    మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు' తర్వాత వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 20న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అధికారిక ప్రకటన చేయకున్నా.. ఈ మేరకు మిగతా నిర్మాతలకు హింట్స్ ఇచ్చేశారు. వచ్చే వేసవికి అల్లు అర్జున్-వక్కంతం వంశీల ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.. రామ్ చరణ్-సుకుమార్‌ల ‘రంగస్థలం'తో పాటు మరికొన్ని భారీ సినిమాలు రావాల్సి ఉంది.

     సంక్రాంతికే అనుకున్నప్పటికీ

    సంక్రాంతికే అనుకున్నప్పటికీ

    "భరత్ అను నేను" సినిమాను ముందు సంక్రాంతికే అనుకున్నప్పటికీ షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం లేటవుతుండటంతో హడావుడి ఎందుకని వేసవిపై దృష్టిపెట్టారు. మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్', అంతకుముందు చేసిన ‘బ్రహ్మోత్సవం' డిజాస్టర్‌గా తేలిన నేపథ్యంలో ‘భరత్ అను నేను' అతడి కెరీర్‌కు చాలా కీలకం. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నారు.

    English summary
    Update is that the makers decided to lock the film's release on April 20 which is indeed a good sign as the film may target students and families during summer vacations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X