మహేష్ చేతిలో సినిమాలు
'అతిధి' సినిమా అనంతరం ఖాళీగా ఉన్న మహేష్ ఇప్పుడు పూర్తి స్దాయిలో బిజీ కాబోతున్నాడు.ఇప్పటికే ప్రారంభమయిన 'వరుడు' కాకుండా మరో రెండు సినిమాలు మహేష్ ఓ.కె చేసినట్లు అతని తండ్రి కృష్ణ మీడియో తో కన్పర్మ్ చేసారు.అవి యుటివి వారితో కలసి మహేష్ సోదరి మంజుల గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా ఒకటి, రజనీకాంత్ కూతురు సౌదర్య వార్నర్ బ్రదర్స్ తో కలసి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నిర్మించే చిత్రం మరొకటి.ఈ ఇద్దరు నిర్మాతలు మహిళలే కావటం పెద్ద పెద్ద సంస్ధలతో టైఅప్ అయి ముందుకు రావంటం,అలాగే ఇద్దరూ పెద్ద హీరోలు(కృష్ణ,రజనీకాంత్)కుమార్తెలు కావటం విశేషం.ఇక ఈ సినిమాలన్నీ వరుడు పూర్తయ్యాక ప్రారంభమవుతాయి.


Click it and Unblock the Notifications











