గోవా బీచ్‌లో క్రితితో మహేష్ బాబు రొమాన్స్!
గోవా : మహేష్ బాబు-సుకుమార్ సినిమా ద్వారా క్రితి సానన్ అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతోందని ఇప్పటికే పాఠకుల దృష్టికి తీసుకొచ్చాం. తాజాగా ఈ ఇద్దరిపై గోవాలో రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ఓ సాంగు చిత్రీకరించారను. ఈ నెలాఖరు వరకు షూటింగ్ గోవాలో జరుగనుంది.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్న క్రితి సానన్‌కు ఇదే తొలి సినిమా అవకాశంఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు. ఇందుకోసం అయన అమెరికా నుండి ప్రత్యేకంగా ట్రైనర్ ని కూడా తెచ్చుకున్నారు. ఈ చిత్రం 2013 వేసవికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications












