»   » ‘దూకుడు’పై మహేష్ లేటెస్ట్ కామెంట్

‘దూకుడు’పై మహేష్ లేటెస్ట్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దూకుడు" విడుదల కోసం నేను కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర మేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చింది. నేను ఇప్పటి వరకూ పనిచేసిన ప్రొడక్షన్స్‌లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ ఇది. ఇక శ్రీను వైట్ల వర్కింగ్ స్టైల్ సూపర్బ్..అంటూ తను పనిచేస్తున్న 'దూకుడు"చిత్రం గురించి మహేష్ బాబు తాజాగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేసారు.

తను పనిచేసే సినిమాల గురించి పెద్దగా మాట్లాడని మహేష్ ఇలా 'దూకుడు" విషయంలో దూకుడుగా ప్రవర్తించటం చాలా మంది ఆశ్చర్యపరుస్తోంది. మహేష్ అభిమానులకు మరింత ఆసక్తి రేపుతోంది. ఇక ఆగస్ట్ చివరి వారంలో 'దూకుడు" సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.

English summary
i would like to thank s.vytla for dookudu.i know what d man"s done for this film thank you sir..waiting for the release ..Mahesh Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu