మహేష్ సునామీలో కొట్టుకుపోతామనే భయం
ఇప్పుడు ఎక్కడ చూసినా విన్నా మహేష్ దూకుడు ప్రభంజనమే. సెప్టెంబర్ 23 న దాదాపు వెయ్యి స్క్రీన్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం ఓ ఉత్సవంలా మారనుంది. ఈ నేపధ్యంలో సినిమాకి మొదటి రోజే పాజిటివ్ టాక్ వస్తే ఈ ధియోటర్స్ లో చాలా భాగం కంటిన్యూ అయ్యే అవకాసం ఉంది. కలెక్షన్స్ తుఫానులా వస్తాయని,మిగతా సినిమాలకి అది సునామిలా మారుతుందని భయపడుతున్నారు. దాంతో ఏ నిర్మాత కూడా దూకుడు విడుదల తర్వాత కానీ,ముందుకాని సినిమా రిలీజ్ లు పెట్టుకోవటానికి భయపడుతున్నారు. నాగార్జున సైతం తన రాజన్న ని ఇందకోసమే వాయిదా వేసుకున్నాడని తెలుస్తోంది. అయితే మంచి ధియోటర్స్ దొరకవనే తాము వాయిదా వేసుకుంటున్నామంటున్నారు.
తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











