twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు ‘మగాడు’ అంటూ హల్ చల్..!

    By Bojja Kumar
    |

    మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'మగాడు' అనే టైటిల్ తో సినిమా వస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాను సి.కళ్యాన్, సింగనమల రమేష్ మణిశర్మ సంగీత దర్శకత్వంలో నిర్మించబోతున్నట్లు అంతా చర్చించుకున్నారు. ఖలేజా భారీ ప్లాపు కావడం... సి.కళ్యాన్, సింగనమల వివిధ పోలీసు కేసుల్లో ఇరుక్కోవడంతో ఈ సినిమా అటకెక్కింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బిజినెస్ మ్యాన్, ఆతర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో బిజి షెడ్యూల్ తో ఉంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్-ఇలియాన జంటగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు.

    అప్పుడెప్పుడో కరుమరుగైన మహేష్ బాబు 'మగాడు' తాజాగా నెట్లో హల్ చల్ చేస్తోంది. 2012లో ఆ సినిమా విడుదల కాబోతోందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే దీనిపై మహేష్, త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అభిమానులే కావాలని మహేష్ బాబు 'మగాడు'ను లైమ్ లైట్లోకి తెస్తున్నారని అనుమానిస్తున్నారు.

    English summary
    Mahesh Babu 'Magadu' movie Posters halchal in the web.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X