మహర్షి 100 కోట్ల జోష్.. మహేష్‌ను కుమ్మేసిన అక్కాచెల్లెళ్లు..
మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ సినిమా మహర్షి ప్రస్తుతం మంచి జోష్‌లో ఉంది. మహేష్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా పేరు తెచ్చుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతోంది. మరోవైపు రైతు నేథ్యంతో సినిమాలో చూపించిన సామాజిక అంశాలకు విశేష స్పందన వస్తోంది. మహేష్ నటనకు, వంశీ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకలోకం నీరాజనం పలుకుతోంది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్టబ్‌లో చేరడంతో మహేశ్ కుటుంబ సభ్యులు పండగ చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు
మే 9 వ తేదీన విడుదలైన మహర్షి సినిమా.. దేశ, విదేశాల్లోని అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. దీంతో ఆనందోత్సాహంలో మునిగిపోయింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ విజయం పట్ల ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు హీరో మహేష్ బాబు, హీరోయిన్ పూజా హెగ్డే. ఇటీవలే గ్రాండ్ సక్సెస్ మీట్‌ని కూడా ఏర్పాటు చేసుకొని తెగ ఎంజాయ్ చేశారు.

రూ.100 కోట్ల క్లబ్‌లో
ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న మహర్షి మూవీ విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. మహేష్ కెరీర్ బిగెస్ట్ హిట్‌గా దూసుకుపోతున్న ఈ సినిమా ఈ వారాంతం కల్లా భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

ప్రిన్స్ మహేష్‌తో నమ్రత, శిల్పా శిరోద్కర్
మరోవైపు మహేష్ బాబు ఫ్యామిలీ అంతా మహర్షి సక్సెస్‌ను బాగా ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ తన భార్య నమ్రత, ఆవిడ సోదరి శిల్పా శిరోద్కర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మహేష్‌తో పాటు నమ్రత, శిల్పా శిరోద్కర్ ఫుల్ జోష్‌లో మహేష్‌ని కుమ్మేస్తూ కనిపిస్తున్నారు. ఈ ముగ్గురినీ ఇలా చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తూ సో క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ కెరీర్‌లో మహర్షి 25 వ సినిమా కావడంతో ఈ సక్సెస్‌పై ప్రేక్షకలోకం కూడా తెగ ఖుషీ అవుతోంది.

హై వోల్టేజ్ టెక్నికల్ మూవీగా
వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో హై వోల్టేజ్ టెక్నీకల్ వాల్యూస్‌తో, భారీ బడ్జెట్ కేటాయించి మహర్షి సినిమా రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై కమర్షియల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











