'మహేష్ మంజ్రేకర్' తో ఎన్టీఆర్ కయ్యం
బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు విలన్ గా సుపరిచయమే. 'ఒక్కడున్నాడు', 'హోమం' లాంటి చిత్రాలలో విలన్ గా నటించిన మహేష్ మంజ్రేకర్ తాజాగా ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న 'అదుర్స్' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం.
ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్ లో ఈయన పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.
adurs jrntr vvvinayak mahesh manjrekar nayantara sheela devisri prasad okkadunnadu homam అదుర్స్ జూఎన్టీఆర్ వివివినాయక్ మహేష్ మంజ్రేకర్ నయనతార షీలా దేవీ శ్రీ ప్రసాద్ ఒక్కడున్నాడు


Click it and Unblock the Notifications