ఐర్లాండ్ లో ...మహేష్ ని చుట్టుముట్టిన ఫ్యాన్స్
హైదరాబాద్: కేవలం ఇండియాలో కాదు...ఐర్లాండులోనూ మహేష్ కు లెక్కకుమించి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ విషయం...రీసెంట్ గా రుజువైంది. ప్రస్తుతం నార్తన్ ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నగరంలో గత కొన్ని రోజులుగా ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ఫ్యాన్స్ ...షూటింగ్ ప్లేస్ కు చేరుకుని మహేష్ ని కలిసారు. మహేష్ కూడా చాలా ఉత్సాహంగా వారితో మాట్లాడి,ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు.
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం '1' ('నేనొక్కడినే' అని ఉపశీర్షిక). సుకుమార్ దర్శకుడు. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనమ్ హీరోయిన్. ఈ నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్, లండన్, యు.కె.లో రెండు నెలల పాటు నిరవధికంగా భారీ షెడ్యూల్‌ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
ఈ షెడ్యూల్ తరువాత యూనిట్ ఇంగ్లాండ్‌కు వెళుతుందని తెలిసింది. అక్కడ కథకు కీలకమైన సీన్స్ షూట్ చేస్తారని సమాచారం. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ సర్వత్రా ఆసక్తిని కలిగించిన విషయం తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడు.
అలాగే గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో మహేష్ పాత్ర చిత్రణ స్టైలిష్‌గా వుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications











