మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది. ఇటీవల వీరిద్దరూ కలుసుకున్నప్పుడే ఈ విషయం ఫైనల్ అయింది. ప్రస్తుతం మహేష్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ కృష్ణలతో కలిసి గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హీరోగా జల్సా సినిమాను రూపొందిస్తున్నాడు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా తాజాగా తలపెట్టిన ప్రాజెక్టు ఏప్రిల్ లో ప్రారంభం కానున్నది.