మహేష్ బాబు నెక్ట్స్ రెండు సినిమాలూ ప్రారంభం ఎప్పుడంటే..
మహేష్ బాబు తన రెగ్యులర్ స్టైల్ ని మార్చుకుని ఏడాదికి రెండు సినిమాల్లో కనిపించటానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అతిధి రిలీజైన రెండు సంవత్సరాల అనంతరం మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నాడు. అలాగే శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని జనవరి 2010 నుంచి ప్రారంభించనున్నాడు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రూపొందే మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాన్ని జూన్ నుంచి ప్రారంభిస్తాడు. అంటే వచ్చే సంవత్సరం మహేష్ హీరోగా మూడు చిత్రాలు రిలీజ్ అవుతాయన్నమాట. దాని మూలంగా అభిమానుల ఆనందం సంగతి ఏమో గానీ పరిశ్రమలో చాలా శాఖలకు రెగ్యులర్ గా పనులు దొరుకుతాయని అంటున్నారు. ఓ హీరో ప్రారంభిస్తే మిగతా వారు కూడా ముందుకు వచ్చి వరసగా సినిమా చేసి పరిశ్రమను పచ్చగా మారుస్తారని సీనియర్స్ అభిప్రాయపడుతున్నారు.
మహేష్ బాబు సురేంద్రరెడ్డి అతడు త్రిష అతిధి అమృతారావు శ్రీను వైట్ల mahesh babu athadu surendra reddy trisha athidi amrutha rao


Click it and Unblock the Notifications