మహేష్ బాబును వాడుకుంటున్న‘రాక్ స్టార్’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును 'రాక్ స్టార్" వాడుకుంటున్నాడు. తన సినిమా ప్రచారం కోసం మన హీరో పేరును ఒకటికి పదిసార్లు వల్లిస్తున్నాడు. ఇంతకీ ఎవరీ రాక్ స్టార్ అనుకుంటున్నారా? ఇంకెవరు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్. తన తాజా సినిమా 'రాక్ స్టార్" ప్రమోషన్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన రణబీర్ ఐమాక్స్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..... మహేష్ బాబు తనకు మంచి ఫ్రెండ్ అని, అతను నటించిన దూకుడు సినిమా సూపర్ హిట్టవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ అంటే తనకు ఎంతో సెంటిముంటు అని, తన తొలి చిత్రం సావరియా చిత్రం ప్రమోషన్ కూడా ఇక్కడే జరిదిందని, అందుకే రాక్ స్టార్ ప్రమోషన్ కోసం మరోసారి వచ్చానని, రాక్ స్టార్ సినిమా వైవిధ్యంగా, అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నాడు.
రాక్ స్టార్‌లో రణబీర్ సరసన పాక్ ముద్దు గుమ్మ నర్గీస్ ఫక్రి నటిస్తోంది. షమ్మీకపూర్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధిలిన్ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఎఆర్. రెహమాన్, సినిమాటో గ్రఫీ: అనిల్ మెహతా, ఎడిటింగ్: ఆర్తీ బజాజ్, దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











