మళ్లీ తండ్రైన మహేష్ బాబు (అఫీషియల్)

కొన్ని రోజుల క్రితమే నమ్రత ఆడపిల్లకు జన్మనిచ్చిందంటూ పుకారు వినిపించింది. అయితే ఆ తర్వాత నమ్రత ఆ విషయాన్ని ఖండిస్తూ.....ఆగస్టులో డెలివరీ అవ్వొచ్చని వెల్లడించారు. అయితే ఆమె చెప్పిన దానికంటే ముందే ప్రసవం అవ్వడం గమనార్హం.
కాగా.. మహేష్ మళ్లీ తండ్రైన వార్త అధికారికంగా దృవీకరణ కావడంతో మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల స్వీట్లు పంచారు. ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నారు. నమ్రత ప్రసవించిన నేపథ్యంలో ఓ వారం రోజుల పాటు ఆయన షూటింగులకు బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది.
మహేష్-నమ్రత 5 సంవత్సరాల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరిలో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ చిత్రంలో ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమాలో పరిచయం వీరి మధ్య ప్రేమకు దారి తీసింది. అనంతరం పెళ్లి చేసుకున్నారు. 2006, ఆగస్టు 31న గౌతంకు జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











