ఈ ఏడాది.... మహేష్ బాబు, నాని ఇద్దరూ అంతే!
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయన సినిమాల పట్ల ఉన్న ఆసక్తి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే ఎంత ఫాలోయిగ్ ఉన్నా......సినిమాలు వారికి నచ్చే విధంగా లేక పోతే తిరస్కరించడం ఖాయం.
ఈ ఏడాది మహేష్ బాబు రెండు భారీ సినిమాల్లో నటించాడు. అనూహ్యంగా రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డాయి. నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి ‘1-నేనొక్కడినే' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేష్ బాబు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్స్ కొత్తదనంతో కూడినప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు తిరస్కరించారు.

కొత్త కాన్సెప్టులను నమ్ముకుంటే ఫలితం ఉండదనే భావనతో దీని తర్వాత ‘ఆగడు' సినిమా ద్వారా వచ్చిన మహేష్ బాబుకు మరోసారి నిరాశ తప్పలేదు. మూసధోరణితో కూడిన రొటీన్ కమర్షియల్ మూవీ కావడంతో ‘ఆగడు' సినిమా అస్సలు ఇస్టపడేలేదు ప్రేక్షకులు. ఫలితంగా ఈ ఏడాది మహేష్ బాబుకు ఒక్క హిట్టూ దక్కలేదు.
మహేష్ బాబు సంగతి పక్కన పెడితే...యువ హీరో నాని పరిస్థితి కూడా ఇలానే తయారైంది. గతంలో వరుస హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని ఈ ఏడాది ‘పైసా', ‘ఆహా కళ్యాణం' సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద సక్సెస్ అందుకోవడంలో విఫలం అయ్యాయి.


Click it and Unblock the Notifications











