ఆరు నెలలు క్రిందట రిలీజయిన 'అతిథి" తరువాత ఇప్పటి వరకు మహేష్ బాబు మేకప్ వేసుకోలేదు. కెమేరా ముందుకు రాలేదు. దాంతో అసలు ఎప్పుడు కొత్త సినిమా ప్రారంభమవుతుంది, ఎప్పుడు రిలీజవుతుందని అందరికి సందేహాలు కలుగుతున్నాయి. వీటిన్నిటికి సమాధానంగా మహేష్ ఓ ప్రైవేట్ సంస్ధ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెదవి విప్పాడు. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో చేసేందుకు నిర్ణయించుకున్నానని కన్ ఫర్మ్ చేసాడు. దానికి 'వరుడు' అని వర్కింగ్ టైటిలు అనుకుంటున్నామని తెలిపాడు. శింగనమల రమేష్, మంజుల సంయుక్తంగా నిర్మిస్తున్నారని అన్నాడు. అంతేగాక ఏప్రిల్‌లో మొదలయ్యే ఈ సినిమా 2009 లో రిలీజయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసాడు. అలాగే ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీని రూపొందించుకుంటున్నాడని వస్తున్న ప్రచారాన్ని నవ్వుతో కొట్టిపడేసాడు. ఏదేమైనా 'అతడు' లాంటి భ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చిన కాంబినేషన్ రిపీటవటం సంతోషమే గాని ఇలా ఇంతంత గ్యాప్ తో సినిమాలు చేస్తే ఎలా అని మహేష్ అభిమానులు వాపోతున్నారు.