For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎమ్.ఎస్ రాజుకి మహేష్ హ్యాండిచ్చాడా?

  By Srikanya
  |

  మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం ఒక్కడు. ఆ చిత్రానికి నిర్మాత ఎమ్.ఎస్ రాజు. ప్రస్తుతం ఎమ్.ఎస్ రాజు తన కుమారుడు సుమంత్ అశ్విన్ హీరోగా 'తూనీగ తూనీగ'చిత్రం నిర్మించి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియో పంక్షన్ నిన్న (ఆదివారం)రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ పంక్షన్ కి ప్రభాస్,మహేష్ వస్తారని పబ్లిసిటీ జరిగింది. అయితే చిత్రంగా వారిద్దరూ ఈ ఆడియోకు కనపడకపోవటంతో అందరూ ఆశ్చర్యపోయారు. వారు హ్యాండిచ్చారా అని డౌట్లు వచ్చాయి.

  ఆడియో విశేషాల్లోకి వెళితే...ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్ రాజు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా నటించిన చిత్రం 'తూనీగ తూనీగ'. రియా హీరోయిన్ గా యమ్‌.యస్‌.రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మాగంటి రామ్‌చంద్రన్‌ (రామ్‌జీ) నిర్మాత. దిల్‌రాజు సమర్పకులు. కార్తీక్‌ రాజా స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని పాటల్ని ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. తొలి సీడీని డి.సురేష్‌బాబు ఆవిష్కరించారు. దిల్‌ రాజు మాట్లాడుతూ ''వర్షం, వాన... అని రెండు సినిమాలు తీశారు యమ్‌.యస్‌.రాజు. అందుకే వర్షంలో ఈ పాటల వేడుకను జరుపుకొంటున్నామ''న్నారు.

  నిర్మాత, మాజీ మంత్రి మాగంటి బాబు మాట్లాడుతూ ''మా పెద్దబ్బాయి రామ్‌చంద్రన్‌ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఎమ్మెస్‌ రాజు తనయుడు సుమంత్‌ కథానాయకుడు కావడం ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇద్దరూ పైకి రావాలని కోరుకొంటున్నా'' అన్నారు. ''నటుడు కావాలన్నది సుమంత్‌ అశ్విన్‌ కోరిక. తను చిన్నప్పట్నుంచే సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రం నేను చూశాను. తను ఎంతో పరిణతితో నటించాడ''అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు.

  ''నటన, నాట్యం, యాక్షన్‌... ఇలా ప్రతి విషయంలోనూ సుమంత్‌ని తీర్చిదిద్దారు యమ్‌.యస్‌.రాజు. భవిష్యత్తులో వెండితెరను ఏలే నటుడు అవుతాడన్న నమ్మకం నాకుంద''న్నారు పరుచూరి గోపాలకృష్ణ. ''ప్రేమకథల్లో ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది ఈ చిత్రం. అశ్విన్‌ని నేను చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. తనలో చాలా ప్రతిభ ఉంది. భవిష్యత్తులో మంచి నటుడిగా ఎదుగుతార''అన్నారు ఆర్‌.పి.పట్నాయక్‌. ఈ కార్యక్రమంలో మణిశర్మ, కోటి, శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ణ, కె.ఎల్‌.నారాయణ, నల్లమలుపు శ్రీనివాస్‌, ఎమ్‌.ఎల్‌.కుమార్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

  ఎమ్.ఎస్ రాజు గతంలో నిర్మించిన సూపర్ హిట్ చిత్రం 'మనసంతా నువ్వే'లోని 'తూనీగ... తూనీగ, ఎందాక పరిగెడతావె' పాటలోని పదాలుతో ఈ టైటిల్ ని సెంటిమెంట్ గా పెట్టారు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. ఫెరఫెక్షన్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎమ్ ఎస్ రాజు తన కుమారుడు చిత్రాన్ని శిల్పం చెక్కినట్లు చెక్కుతున్నారని వినికిడి. అలాగే తమ బ్యానర్ లో వర్షం,మనసంతా నువ్వే,నువ్వొస్తానంటే నే వద్దంటానా వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చి ఉండటంతో ఈ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ అని అంచనాలు ఉన్నారు. ఇక ఎమ్ ఎస్ రాజు వాన చిత్రంతో డైరక్టర్ గా మారారు. ఆయన రెండో చిత్రం ఇది.

  English summary
  MS Raju’s son Sumanth Ashwin maiden venture Tuneega Tuneega movie audio songs were released at Lalita Kala Thoranam, Public garden Hyderabad. First CD of music album was revealed by D Suresh and Handed it to K Shyam Prasad Reddy. Karteek Raja is the music director of the film. Aditya music is marketing Tuneega Tuneega audio.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X