మహేష్, జూ ఎన్టీఆర్ లకు రికార్డులు కాదు ‘బ్రాండ్ల’ పిచ్చి భాగా ముదిరింది...
బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్ని బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంటే అంత పాపులర్ స్టార్ అన్నట్టు అనే భ్రమ తెలుగు హీరోల్లో నానాటికీ ముదిరిపోతోంది. మహేష్ జేమ్స్ 'బ్రాండ్"గా అవతరించడంతో ఈ పిచ్చి పీక్స్ కెళ్లింది. ఇమ్మీడియట్ గా జూ ఎన్టీఆర్ కూడా తన తడాఖా చూపించడానికి బ్రాండ్ అంబాసిడర్ గా రంగంలోకి దిగాడు. మహేష్ ఏవైతే బ్రాండ్లకి ప్రచారం చేస్తున్నాడో వాటికి పోటీదారులైన వారితో ఎన్టీఆర్ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. మహేష్ రేటెక్కువ చెప్పాడని తగ్గన వారితో తక్కువకే ఎన్టీఆర్ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. అంతే కాక మహేష్ ప్రచారం చేస్తున్న బ్రాండ్ల అనుబంధ సంస్థలకి కూడా ఎన్టీఆర్ సైన్ చేస్తున్నాడు. ఈ పోటీ ముదిరి పాకాన పడిందిప్పుడు. మగాళ్లు ప్రచారం చేయాల్సిన బ్రాండ్స్ నుంచి ఆడవాళ్లు ప్రచారం చేసే ఉత్పత్తులకి కూడా ఇప్పుడు హీరోలే ప్యాంటు బిగిస్తున్నారు.
నగల షోరూమ్ లకి హీరోలు ప్రచారం చేయడం ఇప్పుడు కొత్త ఫ్యాషన్ గా మారింది. కళ్యాణ్ జువెలరీకి నాగార్జున, మలాబార్ గోల్డ్ కి ఎన్టీఆర్ ప్రచారం చేస్తుంటే జాయ్ అలుక్కాస్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడని ప్రచారం జరుగుతోంది. మా హీరోకి రికార్డులున్నాయి అని అభిమానులు వాదించుకునే రోజులు పోయి మా హీరోకి అన్ని బ్రాండ్లున్నాయంటూ కాలరెగరేసే రోజులొచ్చేశాయి.


Click it and Unblock the Notifications











