ఎన్టీఆర్, రాంచరణ్.. ఇప్పుడు మూడోది లోడింగ్.. బ్లాక్ బస్టర్ మొనగాళ్లంతా ఒకే చోట!

హీరోల మధ్య ఇగో ఫీలింగ్స్.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ టాప్ హీరోలు మరో స్టార్ హీరో ఆడియో వేడుకకు అతిధిగా హాజరయ్యేంత చనువుగా ఉంటున్నారు. మన స్టార్ హీరోలు పరిణితితో ఆలోచించడం వలనే ఇలా అరుదైన దృశ్యాలు చూస్తున్నాం అని సినీ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు తరచుగా పార్టీలలో దర్శనం ఇస్తున్నారు. అలాంటి సందర్భం మరో మారు వచ్చింది.

బర్త్ డే సెలెబ్రేషన్స్

బర్త్ డే సెలెబ్రేషన్స్

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి జన్మదినం సందర్భంగా మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్ కలుసుకున్నారు. బర్త్ డే పార్టీకి ఈ ముగ్గురు హీరోలు హాజరు కావడం విశేషం. దీనికి సంబందించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

కామన్ పాయింట్

కామన్ పాయింట్

దర్శకుడు వంశీ పైడిపల్లి కోణంలో ఆలోచిస్తే ఈ ముగ్గురి హీరోలలో కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఎన్టీఆర్ తో ఈ దర్శకుడు బృందావనం చిత్రం తెరకెక్కించాడు. రాంచరణ్ తో ఎవడు చిత్రం తీశాడు. ఈ రెండు చిత్రం సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలీసీనే.

 బ్లాక్ బస్టర్ మొనగాళ్లంతా

బ్లాక్ బస్టర్ మొనగాళ్లంతా

ఈ వేడుకకు ముగ్గరు హీరోలతో పాటు బ్లాక్ బస్టర్ దర్శకులు కొరటాల శివ, సుకుమార్ కూడా హాజరయ్యారు. నిర్మాత దిల్ రాజు కూడా ఫోటోలలో కనిపిస్తున్నాడు. దిల్ రాజు, వైజయంతి మూవీస్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

భారీ చిత్రాలు

భారీ చిత్రాలు

ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్ ప్రస్తుతం భారీ చిత్రాలలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, రాంచరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. వంశీ చిత్రం తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయవలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X