ప్రిన్స్ స్థానంలో నాగచైతన్యను
ఇందిరా క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ బాబు, డైనమిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ల కామబినేషన్ లో మంజుళ నిర్మిచబోతున్న సినిమాలో మహేష్ స్థానంలో నాగచైతన్యను తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.మహేష్ కాల్షీట్ల అందుబాటులో లేకపోవడం వల్ల నాగచైతన్యను ఎంపికచేసినట్టు తెలిసింది.
నాగచైతన్య నటించిన తొలి చిత్రం జోష్ ఆగష్టు నెలలో ప్రేక్షకులముందుకు రాబోతోంది, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఇది చైతన్య నటించబోయే రెండవ చిత్రం. యాక్షన్ చిత్రాలను రూపొందించడంలో తనదంటూ ప్రత్యేక శైలి కనబరిచే గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రాబోవు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడతాయనడంలో సందేహంలేదు.
చైతన్యకు అనుగునంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయడం జరిగింది. ఇదిలా వుంటే ఈ చిత్రం శిలంబరసన్, త్రిషల కాంబినేషన్ లో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న తమిళచిత్రం "విన్నతాండి వరువాయ్" కి రీమేక్ అని సమాచారం.
mahesh babu naga chaitanya goutham meenan manjula josh varudu trisha anushka మహేష్ బాబు నాగచైతన్యను మంజుళ జోష్ గౌతమ్ మీనన్ వరుడు త్రిష


Click it and Unblock the Notifications