మహేష్ బాబు-పవన్ మధ్య విచిత్ర ఘటన
టాలీవుడ్ టాప్ యువహీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మద్య అనుకోకుండానే ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేస్తున్నారు. ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం చాలా అరుదుకానీ...అందులోనూ పోటా పోటీగా ఉండే మన తెలుగు యువ హీరోల విషయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మరింత ఆశ్చర్యం. చిరంజీవి కెరీర్‌ను మలుపుతిప్పిన ఖైదీ చిత్రాన్ని మహేష్‌బాబుతో పూరిజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారంటూ ఓ పక్క ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే.
అలాగే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కూడా ఓ జేమ్స్‌బాండ్ చిత్రంలో నటించనున్నట్లు టాలీవుడ్ టాక్. సురేందర్‌రెడ్డి గతంలో మహేష్‌బాబుకోసం రెడీ చేసుకున్న జేమ్స్‌బాండ్ స్క్రిప్ట్‌ను పవన్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మహేష్‌బాబు డైరీ మరో మూడునాలుగేళ్లదాకా ఖాళీ లేకపోవడంతో సురేందర్‌రెడ్డి పవన్‌తో ట్రైచేస్తున్నట్లు సమాచారం. ఇలా చిరంజీవి చిత్రాన్ని మహేష్‌బాబు, జేమ్స్ బాండ్ హీరోగా పేరుగాంచిన కృష్ణ వారసుడిగా మహేష్ చేయాల్సిన సినిమాను పవన్‌కళ్యాణ్‌లు చేయడం ఆశ్యర్యం కాక మరేమిటి?


Click it and Unblock the Notifications