సింగపూర్లో ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్
ఇటు సినిమాలు, అటు యాడ్ ఫిల్మ్..ఇలా వరుస షూటింగులతో ఎడతెరిపి లేకుండా గడుపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వీటన్నింటికీ బ్రేక్ వేసి...కొంతకాలం రెస్ట్ తీసుకోనున్నాడు. పది రోజుల పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేశాడు. భార్య నమ్రత, కొడుకు గౌతంతో కలిసి సింగ్‌పూర్ వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడు. తిరిగి ఏప్రిల్ 11న మహేష్ బాబు మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చి యదావిధిగా సినిమా షూటింగుల్లో పాల్గొననున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన సమంత, వెంకీ సరసన అంజలి హీరోయిన్లు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈచిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ చిత్రంలో మహేష్ బాబు కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











