మహేష్‌ పోకిరి ఏప్రిల్‌ 28న విడుదల

By Staff

మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల చిత్రం పోకిరి ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. ఈ సినిమా క్లెయిమాక్స్‌ ఫైటింగ్‌ సన్నివేశాలను స్టంట్‌ మాస్టర్‌ విజయన్‌ చెన్నై బిన్ని మిల్స్‌ బిల్డింగ్‌లో మార్చి 1 నుంచి 11 వరకు చిత్రీకరించారు. క్లెయిమాక్స్‌లో మహేష్‌బాబు డూప్‌లేకుండా ఒక రిస్కీ షాట్‌ చేశారు. ఈ క్లెయిమాక్స్‌ని విదేశీ సాంకేతిక నిపుణుల సహకారంతో అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రీకరించారు. మహేష్‌ -ఇలియానాలపై మార్చి 15 నుంచి 25 వరకు ఆ్రస్టియా, జర్మనీ, ఇటీలీ దేశాల్లో రెండు పాటలను చిత్రీకరిస్తారు. మార్చి 27 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ ఉంటుంది. అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలలో భారీ సెట్స్‌లో మరో పాటను మహేష్‌-ఇలియానాలతో చిత్రీకరిస్తారు. మణిశర్మ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో ఏప్రిల్‌2న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X