మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్లో చిత్రం!?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్నఖిలాడి చిత్రం షూటింగ్‌లో మహేష్ బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటింపజేయాలని ప్రముఖ నిర్మాత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మగధీర అనంతరం సునీల్ తో చేస్తున్న మర్యాద రామన్న కామిడీలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి, మహేష్ బాబుల కలయికలో చిత్రం నిర్మాణం జరిగితే తెలుగులో అత్యధిక వ్యయంతో తెరకెక్కే చిత్రం ఇదే అవుతుందని విశ్లేకులు చెబుతున్నారు. వ్యాపార పరంగా కూడా ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.ఇక త్రివిక్రమ్ చిత్రంలో మహేష్ సరసన అనూష్క చేస్తోంది. పులి చిత్రాన్ని నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్ కి ఈ చిత్రం ధియోటర్స్ లో ఉంటుంది.
త్రివిక్రమ్ పోకిరి మహేష్ బాబు సునీల్ రాజమౌళి మగధీర మర్యాదరామన్న రామ్ చరణ్ కాజల్ అనూష్క పులి rajamouli mahesh pokiri magadheera ram charan kajal anushka trivikram


Click it and Unblock the Notifications