మహేష్, రామ్ చరణ్ ఒకటే మాట

By Srikanya

కొత్త హీరోయిన్స్ కి నేనేమి వ్యతిరేకం కాదు.. కాకపోతే నేను చేస్తున్న చిత్రాల పాత్రలకు ఆల్రెడీ ఉన్న హీరోయిన్స్ సరిపోతారు కాబట్టి వాళ్లనే తీసుకుంటున్నాం అన్నారు మహేష్ బాబు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంతను రిపీట్ చేయటానికి కారణం వివరిస్తూ... మాది హిట్ పెయిర్ అని రిపీట్ చేయటం లేదు.. ఆమె ఆ పాత్రకు కరెక్టుగా సరిపోతుందని దర్శకుడు భావించారు. స్క్రిప్టు ప్రకారం కొత్త అమ్మాయి అయితే సూట్ అవుతుందనిపిస్తే ఆమెనే తీసుకుంటాను అన్నారు.

ఇదే విషయమై రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ... వినాయిక్ చిత్రంలో తాను కాజల్ ని రిపీట్ చేస్తున్నారు. మగధీర మ్యాజిక్ ని రిపీట్ చేయాలని కాదు.. ఆమె కరెక్టుగా ఆ పాత్రకు సూట్ అవుతుందనే తీసుకున్నాం అన్నారు. అయినా మేము ఎందుకు మళ్లీ కలిసి చేయకూడదు. అయినా నిజంగానే కొత్త హీరోయిన్స్ కొరత తెలుగు పరిశ్రమలో ఉంది. నా మటుకు నేను కొత్త వాళ్లతో చేయటానకి ముందుంటాను. ఇప్పుడు నా ఎవడు చిత్రం ఎమీ జాక్సన్ తో చేస్తున్నా. అలాగే వినాయిక్ చిత్రంలో మరో హీరోయిన్ గా అమలా పౌల్ ని కూడా పరిశీలుస్తున్నాం అని అన్నారు. ఆరెంజ్ చిత్రంలోనూ సెకండ్ హీరోయిన్ గా కొత్త ఆమెను తీసుకున్నామని ఆయన తెలియపరిచారు.

ఇక వెంకటేష్ కొత్త హీరోయిన్స్ కొరత విషయమై మాట్లాడుతూ... నో డౌట్... మనకు తెలుగులో హీరోయిన్స్ కొరత చాలా ఉంది. స్క్రిప్టు డిమాండ్ మేరకు సరపడ హీరోయిన్స్ దొరకటం లేదు.. ఉన్నవారితోనే ఎడ్జెస్ట్ అవ్వాల్సి వస్తోంది అన్నారు. ఆయన తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆయన సరసన చేయటానకి హీరోయిన్ సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే బాడీగార్డ్ లోనూ వేరే హీరోయిన్స్ దొరకకే త్రిషను రిపీట్ చేసారని వినపడింది.

నాగచైతన్య కూడా ఇదే మ్యాటర్ పై స్పందిస్తూ... మాకు ఇంకా పెద్ద సమస్య ఉంది. మా ఏజ్ గ్రూప్ కి తగ్గ హీరోయిన్స్ అసలు దొరకటం లేదని వాపోయారు. దర్శకుడు వీరూపోట్ల ఈ విషయమై స్పందిస్తూ... మనకు చాలా హాట్ గా ఉండే మోడల్స్ దొరకుతున్నారు. వారిని హీరోయిన్స్ గా తీసుకుందామంటే వారు ఫెరఫార్మెన్స్ విషయంలో చాలా పూర్. దాంతో ఎస్టాబ్లిషిడ్ హీరోయిన్స్ వైపే మొగ్గు చూపాల్సి వస్తోంది. ఎస్టాబ్లిషిడ్ హీరోయిన్స్ చాలా బిజీగా ఉంటున్నారు అన్నారు. అలా అందరూ హీరోయిన్స్ కొరత తెలుగులో చాలా ఉందని తేల్చి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X