మహేష్‌, చెర్రీ గురించి తప్పుగా...చానల్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రతి సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 2013లో మహేష్ బాబు నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రాలు పోటా పోటీగా విడుదలయ్యాయి.

ఇక 2014 సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన 'ఎవడు', మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే' చిత్రం విడులయ్యాయి. తాజాగా 'ఆగడు' చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు, 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ సారి దసరా రేసులో పోటీ పడటానికి రెడీ అవుతున్నారు.

Mahesh and Ram Charan clashing again

పై అంశాలను బేస్ చేసుకుని పలు టీవీ ఛానల్స్ ఎంటర్టెన్మెంట్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయి. అయితే కొన్ని ఛానల్స్ 2013 సంక్రాంతి బరిలో మహేష్ బాబు విజేతగా నిలిచాడని, 2014 సంక్రాంతి బరిలో రామ్ చరణ్ విజేతగా నిలిచాడు అంటూ తమ కథనాల్లో పేర్కొన్నాయి.

అయితే ఈ వార్తలపై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో సంక్రాంతికి విడుదలైన 'నాయక్' చిత్రం భారీ విజయం సాధించిందని, ఈచిత్రాన్ని ఓటమి పాలైన చిత్రంగా న్యూస్ చానల్స్ పేర్కొనడం సరికాదని అంటున్నారు. ఇది తమ హీరో ప్రతిష్టకు సంబంధించిన విషయం అంటూ సదరు వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X