»   » విదేశాల్లో ఆ సరదా తీర్చుకుంటా: మహేష్ బాబు

విదేశాల్లో ఆ సరదా తీర్చుకుంటా: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''బైక్‌ రైడింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో నడిపేవాడిని. ఇప్పుడు కుదరడం లేదు.. అభిమానులు చుట్టుముట్టేస్తారుగా..! అందుకే విదేశాలకు వెళ్లినపుడు సరదా తీర్చుకుంటున్నా'' అన్నారు మహేష్‌బాబు.

ఒక ద్విచక్ర వాహన కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే.. 'ఇటీవలే ట్రాక్టర్‌ నడిపారు.. ఇప్పుడు బైక్‌ ఎక్కుతున్నారు.. ఫర్వాలేదా' అన్న ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు.

బైక్‌లలో అధునాతన సాంకేతికత, నాణ్యత తనకు ఇష్టమని పేర్కొన్నారు. గతంలో సినిమా 3-4 నెలల్లో పూర్తయ్యేది. ఇప్పుడు 8-9 నెలలు పడుతోంది. అందుకే తక్కువ సినిమాల్లో నటిస్తున్నట్లు ఉందని, అయితే తాను సంవత్సరం అంతా కష్టపడుతున్నానని చెప్పారు. ప్రఖ్యాత సంస్థల ఉత్పత్తులు నచ్చితేనే ప్రచారకర్తగా వ్యవహరించేందుకు అంగీకరిస్తున్నానని తెలిపారు.


మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న '1'(ఒక్కడినే)షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ....ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

ఈ టీజర్‌కి ఇప్పటికే 1 మిలియన్‌పై హిట్స్ వచ్చి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు, ప్రత్యేకంగా సూపర్ స్టార్ అభిమానులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఈ నెల 18 నుంచి నార్తన్ ఐర్లాండ్(బెల్ ఫాస్ట్), లండన్, యుకెలో 60 రోజుల పాటు ఏకధాటిగా భారీ షెడ్యూల్ జరుగుతుంది.

English summary
Mahesh started enjoying riding bikes in forieghn.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu