పోకిరితో రికార్డులు ఇచ్చిన డైరెక్టర్ కి మహేష్ చెక్ పెడతాడా...!?
పోకిరి సినిమా తర్వాత అయిదేళ్ల కాలంలో పూరి జగన్నాథ్ చాలా సినిమాలే తీశాడు. అయితే ఇంతవరకు ఆ ఇన్ ఫ్లుయెన్స్ నుంచి బయటపడలేక మళ్లీ మళ్లీ అదే కథతో సినిమాలు తీస్తున్నాడు. పర్సనల్ ప్రాబ్లెమ్స్ వల్ల పూరి జగన్నాథ్ తన కథల తయారీలో ఇదివరకటి శ్రధ్ద పెట్టకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఏ సినిమాకైనా కథని వారం పది రోజుల్లో గా రాసేసుకుని త్వరత్వరగా సొమ్ము చేసుకోవాలనే తొందరలో ఉన్న పూరి తనకి తెలియకుండానే సోకిరి కథని వివిధ విధాలుగా మళ్లీ మళ్లీ తీసేస్తున్నాడు. అమితాబ్ తో తీసిన బుడ్డాలోనూ పూరి అదే తీరు కనబర్చడంతో అతనితో తర్వాత చిత్రం చేయబోతున్న మహేష్ ఆలోచనలో పడ్డాడు.
పూరి డైరెక్షన్ లో బిజినెస్ మేన్ చేయడానికి కమిట్ అయిన మహేష్ దాని సూటింగ్ మొదలు పెట్టాలంటే బౌండ్ స్ర్కిప్ట్ తీసుకు రావాల్సిందేనని పట్టుబడుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం తీసే సినిమా కూడా అలాగే అనిపిస్తే ప్లాపవుతుందనేది మహేష్ ఆలోచన అట...
అయితే మహేష్ ఫ్యాన్స్ లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'పోకిరి" దృష్టిలో పెట్టుకొని సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. అటు ఫ్యాన్స్ ఇటు ట్రేడ్ వర్గాలలో ఈ సినిమా ఆరంభమవ్వకముందే పెరిగిన ఈ అంచనాలను పూరీ ఎలా ఫేస్ చేస్తాడో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











