twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిరిడిసాయి'లో నాటకీయత కోసం తప్పలేదు

    By Srikanya
    |

    హైదరాబాద్ : గురు చరిత్రలో లేని కొన్ని అంశాలు 'శిరిడిసాయి'లో ఉన్న మాట నిజమే. ఉదాహరణకి సాయి హిమాలయాకు వెళ్లి అక్కడ వివిధ మతాలకు చెందిన గురువులతో సంభాషించడం, చివరకు 'ఒక్కడే దేవుడు' అని చెప్పడం, చివరలో ఆయన దేహం సమాధి స్థితిలో ఉంటే ఆత్మ వైకుంఠం, కైలాసం, బ్రహ్మలోకం వెళ్లి వచ్చిందని చూపించడం వంటివి గురుచరిత్రలో లేవు. వాటిని వేరే పుస్తకాల్లోంచి తీసుకున్నారు. ఈ సినిమా కథ కోసం ఇరవై పైగా పుస్తకాలు పరిశీలించారు. ఏ సినిమాకైనా నాటకీయత తప్పదు. దానినే 'శిరిడిసాయి' కోసం డైరెక్టర్ రాఘవేంద్రరావు పాటించారు అన్నారు నిర్మాత మహేష్ రెడ్డి.

    నాగార్జున ప్రధాన పాత్రధారిగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'శిరిడిసాయి'కి ఆయన నిర్మాత. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో సంభాషించారు మహేశ్‌రెడ్డి. ఆయన మాటల్లోనే... 'శిరిడిసాయి' ఘన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 40 నుంచి 50 లక్షల మంది వరకు మా చిత్రాన్ని చూశారు. మరిన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

    అలాగే సినిమా విడుదలైనప్పటి నుంచీ రాష్ట్రమంతా సాయిమయం అయిపోయింది. చాలా కాలం నుంచి సినిమాలు చూడని వాళ్లు ఈ సినిమాకి వచ్చారు. అన్ని థియేటర్లు గుడులవడం దీనికి సంబంధించిన మరో విశేషం. ఇప్పటికీ వారాంతాల్లో థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. అమెరికాలోనే కాక ఇతర దేశాల్లోనూ బాగా ఆడుతోంది. ఈ సినిమాకి పనిచేసిన నాగార్జున, కె. రాఘవేంద్రరావు, కీరవాణి, పరుచూరి బ్రదర్స్ వంటివారు చరిత్రలో నిలిచిపోతారు అని చెప్పుకొచ్చారు.

    లాభ,నష్టాలు ప్రసక్తి లేకుండా తీసానని చెపుతూ...ఇవాళ బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ ఎన్నో డెఫిసిట్‌లో రిలీజవుతున్నాయి. 'శిరిడిసాయి'కి మాత్రం మేం పెట్టినదంతా విడుదలకు ముందే వచ్చేసింది. సాయితత్వాన్ని నలుగురికీ తెలియజేయాలనే మా సంకల్పం నెరవేరింది. చాలామంది ఈ సినిమా చూసి షిర్డీకి వెళ్లి బాబాని దర్శనం చేసుకుంటున్నారు ఇప్పటివరకు వచ్చిన సినిమాలు సాయి జీవిత చరిత్ర చెబితే మేం సాయి తత్త్వాన్ని చూపించాం. అది అందరికీ నచ్చుతోంది అన్నారు.

    English summary
    After Annamayya and Srirama Dasu, 'King' Nagarjuna is back with another devotional film Shiridi Sai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X