2 సార్లు రొమాన్స్ చేస్తేనే మహేష్ బాబుకు తృప్తి!
సినీ రంగంలో...ముఖ్యంగా టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, దర్శకులు ఓ ట్రెండ్ ఫాలో అవుతుంటారు. తమకు నచ్చిన హీరోయిన్లను వరుసగా కంటిన్యూ చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు కూడా ఈ ట్రెండును ఫాలో అవుతున్నాడు. దూకుడు సినిమాలో తన సరసన నటించిన సమంతను, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలోనూ కంటిన్యూ చేస్తున్నాడు.
తాజాగా బిజినెస్ మేన్ చిత్రంలో తన సరసన రొమాన్స్ చేసిన కాజల్‌ను...మరోరాసి కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. త్వరలో మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను ఖరారు చేశారు. బిజినెస్ మేన్ చిత్రంలో మహేష్-కాజల్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండటమే ఇందుకు కారణం.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కాలేజీలో లెక్చరర్ గా కనపిస్తారు. సుకుమార్ తన దైన శైలిలో కాలేజి సీన్స్ రాసుకున్నారని వినపడుతోంది. అయితే పూర్తి ఫన్ తో కాలేజీ లెక్చరర్ కీ,స్టూడెంట్స్ కీ మధ్య నడిచే కథతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











