»   »  జనవరి 10న వస్తున్న మహేష్ ‘1-(నేనొక్కడినే)’

జనవరి 10న వస్తున్న మహేష్ ‘1-(నేనొక్కడినే)’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '1(నేనొక్కడినే)' చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాతల ప్రకటనతో రిలీజ్ ఎప్పుడనే ఉత్కంఠకు తెర తీసినట్లయింది.

14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై 'దూకుడు' లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని నిర్మించిన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర తాజాగా సుకుమార్ దర్శకత్వంలో '1(నేనొక్కడినే) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున విడుదలైన మొదటి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లేటెస్టుగా ఆగస్టు 9న రిలీజ్ అయిన రెండో టీజర్‌కి డబుల్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ విషయమై నిర్మాతలు మాట్లాడుతూ...మూడు రోజుల్లోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే మహేష్ బర్త్‌డేకి రిలీజ్ చేసిన రెండో టీజర్ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. లండన్ షెడ్యూల్ పూర్తి కావచ్చింది. జనవరి 10, 2014న సంక్రాంతి కానుకగా వరల్డ్‌గా సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అన్నారు.

మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu’s 1(Nenokkadine) movie will hit the screens on January 10th, 2014 and this information was conveyed by the producers of the movie. The film written and directed by Sukumar. The film is produced by Ram Achanta, Gopichand Achanta and Anil Sunkara under their 14 Reels Entertainment banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu