హాట్ టాపిక్: ‘యాక్షన్' 3డి లో తెలివిగా మహేష్ "1"

By Srikanya

హైదరాబాద్: ఈ రోజు విడుదలైన అల్లరి నరేష్ తాజా చిత్రం 'యాక్షన్' 3డి . ఈ చిత్రంలో భాగంగా మహేష్ బాబు...తాజా చిత్రం "1" నేనొక్కడినే ట్రైలర్ ని చూపెట్టేసారు. చిత్రంలో సుదీప్ పాత్ర...టీవీ ఆన్ చేస్తుంది. అప్పుడు.. ఈ చిత్రం ట్రైలర్ వస్తుంది. ఈ రెండు చిత్రాలకు నిర్మాత ఒకరే కావటంతో ఇలా చేసారు. సినిమా ఎలా ఉన్నా..ట్రైలర్ కి మాత్రం బాగా రెస్పాన్స్ థియోటర్ లో వచ్చింది. ఇక ఈ ట్రైలర్ చూసిన సినిమా వారు..తమ సినిమా ట్రైలర్స్ ని కూడా మిగతా సినిమాల్లో కలిపితే బాగుండననే ఆలోచనకు ఇది ప్రాణం పోసింది.

ఇక '1' చిత్రం ఈ నెల 18 నుంచి లండన్‌, బెల్‌ఫాస్ట్‌ల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ ఏకబిగిన రెండు నెలలపాటు చిత్రీకరణ చేస్తారు. నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర .

అనిల్‌ సుంకర మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక్క రోజులోనే పది లక్షల మంది ఆ టీజర్‌ని వీక్షించారు. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది''అన్నారు. మరో ప్రక్క టీజర్‌ వచ్చిన స్పందన పట్ల మహేష్‌బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X