»   » నడవలేని స్థితిలో.... మహేష్ బాబు 23 ఫోటోస్ లీక్!

నడవలేని స్థితిలో.... మహేష్ బాబు 23 ఫోటోస్ లీక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు తన 23వ సినిమాను ప్రముఖ సౌత్ డైరెక్టర్ మురుగదాస్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

కాగా... కొంత కాలంగా మహేష్ బాబు 23వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఫోటో లీక్ అయింది. నడవలేని స్థితిలో ఆసుపత్రిలో మహేష్ బాబు ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది.

టైటిల్ ఏమిటి?

టైటిల్ ఏమిటి?

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంభవామి అనే అనే టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. సెట్స్ పై ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం గురించి వస్తున్న వార్తలు ఎప్పటికప్పుడు అభిమానులును ఆనందపరుస్తూనే ఉన్నాయి.

రెండు భాషల్లో..

రెండు భాషల్లో..

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటుల విషయంలోనూ రెండు భాషలకు చెందిన నటీనటులను చిత్ర యూనిట్ తీసుకుంటున్నారు.

విలన్ పాత్రల్లో

విలన్ పాత్రల్లో

రు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మహేష్-మురగదాస్ సినిమాలో విలన్ గా తమిళ్ దర్శకుడు నటుడు ఎస్.జె. సూర్య నటిస్తున్నారు.

మహేష్ తమ్ముడి పాత్రలో

మహేష్ తమ్ముడి పాత్రలో

మరో యంగ్ హీరో భరత్ కీలక పాత్రలో కనిపించనున్నాడట. భరత్ అంటే మరెవరో కాదు... గతంలో మనకు ప్రేమిస్తే సినిమాతో పరిచయమైన హీరోనే. అతను మహేష్ కు తమ్ముడు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర అదని అందుకే వెంటనే భరత్ ఓకే చేసాడని అంటున్నారు. భరత్ తెలుగులోనూ మార్కెట్ ఉండటంతో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

స్టోరీలైన్ ఏమిటి?

స్టోరీలైన్ ఏమిటి?

ఇక ఈ చిత్రం కథ గురించి తమిళ సినీ సర్కిల్స్ లో ఓ కథనం ప్రచారం లోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపిస్తారు. ఇండియన్ లీగల్ సిస్టమ్ లో లొసుగులు అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నవారిపై యుద్దం ప్రకటిస్తారు.

బ్రదర్స్ ఫైట్

బ్రదర్స్ ఫైట్

అలాగే ఈ చిత్రంలో మహేష్ కు, అతని సోదరుడుకు మధ్య యుద్దం నడుస్తూంటుంది. అయితే అతని సోదరుడుగా కనిపించేది ఎస్ జె సూర్య కాదట. తమిల హీరో భరత్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెయిన్ ట్విస్ట్ లలో ఇది ఒకటి అంటున్నారు.

అదే టైటిలా?

అదే టైటిలా?

ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘సంభవామి' అనే పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్ర నిర్మాతలు ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆ టైటిల్‌ని రిజిస్టర్‌ చేయించారు.

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్

ఈ సినిమా టైటిల్, లోగోను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేయనున్నారు. అదే విధంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా తెలిసింది.

సమ్మర్ రిలీజ్

సమ్మర్ రిలీజ్

ఈ సినిమాను సమ్మర్ హాలిడేస్ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

English summary
Pic Leaked from Mahesh's 23 sets. A photograph featuring Mahesh Babu in the patient suit and with walker at hospital going viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu