కామెడీతో కుమ్ముడు(‘ఆగడు’ ప్రివ్యూ)
హైదరాబాద్ : మహేష్, శ్రీను వైట్ల ఈ కాంబినేషన్ గతంలో దూకుడు అంటూ చెలరేగిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ అదే నిర్మాతలతో భారీగా వచ్చేస్తూండటంతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దానికి తోడు బ్రహ్మానందం తో చేసిన ఎపిసోడ్స్ సినిమాలో హైలెట్ గా ఉన్నాయని టాక్ రావటం, మహేష్ చెప్పే డైలాగుల టీజర్ జనాల్లోకి దూసుకుపోవటంతో అభిమానులు, కాని వాళ్లు అనే తేడా లేకుండా అడ్వాన్స్ టిక్కెట్ల కోసం జనం ఎగబడ్డారు. వారి అంచనాలు ఏ మేరకు సినిమా నెరవేర్చింది అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
ఈ పోకిరి పోలీస్ అయితే బ్రద్దలైపోయింది. ఈడి దూకుడుని ఎవరూ ఆపలేరు అంటూ ఎనకౌంటర్ శంకర్ గా మహేష్ ఎంట్రీ ఇచ్చిన ఈ కథ బుక్క పట్నంలో జరుగుతుంది. అక్కడ సోనూ సూద్ ని ఎదుర్కోవటానికి శంకర్ చేసే ఎపిసోడ్స్ తో పరుగెడుతుంది. ముఖ్యంగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ హైలెట్ గా థియోటర్ లలో నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సినిమా పీక్స్ కు వెళ్తుంది. డిల్లీ సూరి గా బ్రహ్మానందం ఈ సినిమాలో ఎప్పటిలాగే తన వంతు కామెడీ న్యాయం చేసాడు. బ్రహ్మానందంను వాడుకుంటూ హీరో రివేంజ్ తీర్చుకోవటం జరుగుతుంది. ఇంతకీ ఎనకౌంటర్ శంకర్ కి ఉన్న రివేంజ్ ఏంటి...ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి...ఆ కామెడీ ఏంటి అనేది సినిమాని నిలబెట్టే కథనం.

ముఖ్యంగా సెకండాఫ్ లో బ్రహ్మానందం నాచోరే..నాచోరో,డిల్లకు డిల్లకు, సార్ వస్తారా..సార్ వస్తారా పాటలకు బ్రహ్మానందం డాన్స్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా ఉంది. గబ్బర్ సింగ్ అంత్యాక్షరి తరహా స్పూఫ్ సైతం ఫ్యాన్స్ ను పండుగ చేసుకునేలా చేసింది.
బ్యానర్:14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్
నటీనటులు :మహేష్ బాబు, తమన్నా, డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు
రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్,
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ,
సంగీతం: ఎస్.ఎస్.థమన్,
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్,
ఆర్ట్: ఎఎస్ ప్రకాష్,
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ,
పాటలు: భాస్కర్ భట్ల, శ్రీమణి
కో-డైరెక్టర్: చలసాని రామారావు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి,
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర,
విడుదల తేదీ: 19, సెప్టెంబర్ 2014.
కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











