‘ఆగడు’ స్పెషల్ ట్రైన్ ఎక్కాలంటే...
హైదరాబాద్ : రిలీజ్ రోజు దగ్గర పడుతూండటంతో ఆగడు నిర్మాతలు 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు చేస్తున్న ప్రమోషన్స్ ఒక్కసారిగా పెంచేసారు. ఎక్కడా రాజీపడని విధంగా సూపర్ స్టార్ సినిమాకు ప్రమోషన్ సూపర్ గా చేస్తున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా.... ఇటీవలే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్ కి సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్ అని టైటిల్ పెట్టి ఆ ట్రైన్ మొత్తం ఆగడు పోస్టర్స్ తో వినూత్నంగా ప్రచారం మొదలెట్టారు.
ఈ ట్రైన్ గురించి నిర్మాత మాట్లాడుతూ... "ఈ ట్రైన్ నెల రోజుల వరకూ ఆగడు ఎక్సప్రెస్ గా బ్రాండింగ్ ఉంటుంది. మేము 19 మంది సూపర్ ఫ్యాన్స్ ని సెలక్ట్ చేసి మా యూనిట్ తో పాటు వైజాగ్ తీసుకు వెళ్తాం. అలాగే విన్ అయిన వారందరికీ ఆగడు కిట్స్ కూడా ఇస్తాం. అన్నారు.

మీరు ఈ అవకాసం వినియోగించుకోవాలంటే... ఈ క్రింద మెయిల్ ఐడి కి ... మీ మొబైల్ నెంబర్, పేరు తో మెయిల్ పంపండి..
దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు, మా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ సినిమాకు రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, కెమెరా: కె.వి.గుహన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి.


Click it and Unblock the Notifications











