twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంక్రాంతి బరి నుండి మహేష్ బాబు ఔట్, రిలీజ్‌పై నిర్మాత ప్రకటన!

    సంక్రాంతి బరి నుండి మహేష్ బాబు తప్పుకున్నారు. ఆయన చిత్రం ఏప్రిల్ 27, 2018లో రిలీజ్ కానుంది

    By Bojja Kumar
    |

    Recommended Video

    సంక్రాంతి బరి నుండి మహేష్ బాబు ఔట్.. రిలీజ్‌పై నిర్మాత ప్రకటన!

    సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా(భరత్ అను నేను) సంక్రాంతికి విడుదలవుతుందని అంతా భావించారు. 2018 సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగు మధ్యలో కొన్ని ఆటంకాలు రావడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి.

    ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత దానయ్య డి.వి.వి ఒక ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27, 2018లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుందన్నారు.

    మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ

    మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ

    నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ ''నవంబర్‌ 7 వరకు హైదరాబాద్‌ షెడ్యూల్‌ జరుగుతుంది. నవంబర్‌ 22 నుంచి ఔట్‌ డోర్‌ షెడ్యూల్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతుంది. మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో మా బేనర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. మహేష్‌ కెరీర్‌లో ఇది మరో పవర్‌ఫుల్‌ మూవీ. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 27న సమ్మర్‌ స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

    ‘భరత్ అను నేను'

    ‘భరత్ అను నేను'

    ‘భరత్ అను నేను' సినిమాలో మహేష్ బాబు సీఎంగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఇప్పటికే లీక్ అయ్యాయి. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కొరటాల శివ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మళ్లీ సినిమా సెట్స్ నుండి మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోస్ లీక్ కావడానికి వీల్లేదంటూ కాస్త సీరియస్‌గా ఉన్న కొరటాల... సెట్స్ లో భద్రత పెంచాడని, ఎలాంటి ఫోటోస్ తీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

    అన్నపూర్ణలో భారీ సెట్

    అన్నపూర్ణలో భారీ సెట్

    ఈ చిత్రం షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా సెట్స్ వేశారు. ఇందులో మహేష్ బాబు, ఇతర ముఖ్య పాత్రదారులపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

    తారాగణం

    తారాగణం

    సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

    English summary
    Mahesh 24 Hitting Screens Worldwide On April 27th 2018. Producer DVV Danayya announced the release date through official Twitter handle of DVV Entertainments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X