»   »  మహేష్ పుట్టినరోజు ఎక్కడ జరుపుకుంటాడంటే....

మహేష్ పుట్టినరోజు ఎక్కడ జరుపుకుంటాడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఈ నెల తొమ్మిదివ తేదీన మహేష్ తన పుట్టిన రోజుని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తన పుట్టినరోజు (ఆగస్ట్ 9)ని ఈ సారి లండన్‌లోనే యూనిట్ సభ్యుల మధ్య జరుపుకోనున్నారు మహేశ్. ఆయన భార్య నమ్రత, కొడుకు గౌతమ్‌కృష్ణ, కూతురు సితార కూడా ప్రస్తుతం లండన్‌లో ఆయనతోనే ఉన్నారు. గత నెల్లో తన కూతురు సితార మొదటి పుట్టినరోజుని లండన్‌లోనే జరిపిన మహేశ్ ఈపారి తన పుట్టినరోజుని కూడా అక్కడే జరుపుకోవడం విశేషం. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ థ్రిల్లర్ ' 1 .. నేనొక్కడినే' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  తను నటిస్తున్న '1.. నేనొక్కడినే' చిత్రం షూటింగ్ కోసం గత 30 రోజులనుంచి లండన్‌లోనే మహేశ్ ఉన్న సంగతి విదితమే . మరో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే జరగనుంది. '1'(నేనొక్కడినే) చిత్రం బెల్ ఫాస్ట్, నార్తర్న్ ఐర్లాండ్‌లలో పూర్తి చేసుకుని తాజాగా లండన్ నగరానికి షిప్టయింది. యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జులై 20 వరకు ఇక్కడ షూటింగ్ జరుపుతారని తెలుస్తోంది. ఈ 20 రోజుల పాటు ఇక్కడ యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇటీవలే అందుకు సంబంధించిన సీన్లు చిత్రీకరించారు.

  గౌతమ్‌ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ కన్విన్స్ చేయడంతో ఒప్పుకున్నారని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

  English summary
  Mahesh Babu is currently working for his film, 1 Nenokkadine in London. He has been shooting in UK for the last 30 days and this schedule continues for another 15 more days. So, Mahesh Babu will be celebrating his birthday (August 9th) on the sets in London. His family members - wife and kids are also with him in London. So, he will be taking some time off on August 9th and celebrate the special day with them. The team of 1 Nenokkadine will return to India in the last week of August. Director Sukumar is canning major action sequences in UK.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more