»   » ఈ రోజు నుంచే: మహేష్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం!

ఈ రోజు నుంచే: మహేష్ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యలర్ షూటింగ్ ఈరోజు నుంచి మొదలువుతోంది. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం ఒకే సారి ప్రారంభమవుతోంది.


రామోజీ ఫిల్మ్‌సిటీలో నేడు మొదలయ్యే షూటింగ్ పదిరోజుల పాటు సాగనుంది. మొదటి ఐదు రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌తో పాటు ఈ షెడ్యూల్‌లో మిగిలిన ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారు. సమంత, కాజల్, ప్రణీత.. ఇలా ముగ్గురు హీరోయిన్లతో తెరకెక్కుతోంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


దర్శకుడు మాట్లాడుతూ ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. 'నలుగురు ఉన్న చోట ఓ అందం, ఆనందం ఉంటాయి. అలాంటి అనేకమంది ఒక కుటుంబంలో ఉండి ప్రతి సందర్భాన్ని ఓ ఉత్సవంలా జరుపుకొంటే అదే బ్రహ్మోత్సవం. అలాంటి వాతావరణం మా సినిమాలోనూ కనిపిస్తుందు''అన్నారు.


Mahesh's Brahmotsavam begins today

''మా సంస్థ నుంచి వస్తోన్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రమిది. జులై 10 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ''అని నిర్మాతలు చెప్పారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.


ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి


English summary
Finally the moment has arrived. Very happy to share that the regular shoot of Brahmotsavam begins today. #BrahmotsavamBegins
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu