Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
మహేష్ "బ్రహ్మోత్సవం" మళ్ళీ వచ్చేస్తోంది, రిలీజ్ డేట్ కూడా చెప్పేసారు
"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ బాబు చేసిన చిత్రం "బ్రహ్మోత్సవం". ఈ చిత్రం మహేష్ కెరియర్లో భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిదే చిత్రాన్ని మరోసారి బయటికి తీస్తున్నారు.
మళ్లీ రిలీజ్
తెలుగులో మళ్లీ రిలీజ్ చేస్తున్నారని అనుకుంటున్నారేమో? అలాంటి సాహసం ఇక్కడెవరూ చేయడం లేదు కానీ, ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘స్పైడర్'తో కోలీవుడ్‌కి అధికారికంగా పరిచయమైన మహేష్ బాబు క్రేజ్‌ని వాడుకునేందుకు అక్కడి నిర్మాతలు తాపత్రయపడుతున్నారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో మొదట వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఎంత మంచి హిట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
టైటిల్ అనౌన్స్ మెంట్
దీంతో వీరి కాంబినేషన్ రిపీట్ అవుతూ ఎన్నో అంచనాలతో తెర మీదకు వచ్చిన "బ్రహ్మోత్సవం" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక ఎంతటి దారుణమైన రిజల్ట్ ను చవిచూసిందో అందరికీ తెలుసు.
బిగ్గెస్ట్ డిజాస్టర్
ఈ సినిమా మహేష్ కెరీర్ కు మాత్రమే కాకుండా టాలీవుడ్ హిస్టరీకే ఓ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇలంటి సినిమాని అక్కడ ఆదరిస్తారనే అనుకుంటున్నారట. అందుకే తమిళ డిస్ట్రిబూటర్లు, సమర్పకులు మహేష్ తెలుగు సినిమాల్ని ఇప్పుడు డబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అనిరుధ్
అందులో ముందుగా "బ్రహ్మోత్సవం'ను డబ్ చేస్తున్నారు. 2016లో విడుదలైన "బ్రహ్మోత్సవం"ని తాజాగా ఇప్పుడు కోలీవుడ్‌లో ‘అనిరుధ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా అక్కడ విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
కాజల్, సమంత
టాప్ హీరోయిన్లైన కాజల్, సమంతలు ఈ సినిమాలో ఉండటంతో, ఈ సినిమా కోలీవుడ్‌లో మంచి విజయం సాధిస్తుందని వారు భావిస్తున్నారు. అయితే తెలుగులో అసలు మహేష్ కెరీర్లోనే డిజాస్టర్ అనిపించుకున్న సినిమా అక్కడ హీరోయిన్ల క్రేజ్ తో నిలబడుతుందా అన్నదే డౌటు మరి.. చూద్దాం ఎంతైనా తమిళ ప్రేక్షకుల టేస్ట్ వేరుకదా...