twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ ఆడియో రిలీజ్ డేట్ మారింది...!?

    By Sindhu
    |

    ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తదుపరి చిత్రం 'బిజినెస్ మాన్". పూరి జగన్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రేజీ చిత్రం ఆడియో మొదట డిసెంబర్ 11 అని, తర్వాత డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో కూడా విడుదలవుతుండడంతో ఆడియోను కూడా మూడు భాషల్లో విడుదల చేయాలని చిత్ర వర్గాలు నిర్ణయించడంతో 'బిజినెస్ మ్యాన్" ఆడియో రిలీజ్ ని డిసెంబర్ 23వ తారీకున విడుదల చేయబోతున్నారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం లో కాజల్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది.

    దూకుడు తో మంచి దూకుడు మీదున్న తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మరో విశేషం ఏంటంటే వివాదాల రామ్ గోపాల్ వర్మ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. అందుకే ఈ మధ్య వర్మ మహేష్ ని ట్విట్టర్ లో తెగపొగిడేస్తున్నాడని అర్థం. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా విడుదల కాబోతోంది. పూరి జగన్ మరియు మహేష్ బాబు పోకిరి ఘన విజయం తరువాత కలిసి చేస్తున్న మొట్ట మొదటి చిత్రం ఇదే.

    English summary
    Prince and Superstar Mahesh Babu’s upcoming movie ‘The Businessman’ audio songs will be reportedly release in three languages - Telugu, Tamil & Malayalam. Sources say that Businessman audio songs release date will be on December 23.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X