‘దూకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 9 కోట్లు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించని దూకుడు సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 23) విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకెలుతోంది. అన్ని సెంటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. సినీ నిర్మాతల నుంచి అందిన సమాచారం దూకుడు సినిమా తొలి రోజు దాదాపు రూ. 9 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ. 2 కోట్లు వసూలు చేసిందని డిస్టిబ్యూటరీ వర్గాలు అంటున్నాయి. మరి కొన్ని రోజుల్లో దూకుడు ఇంతకు ముందు వచ్చిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అంటున్నారు అభిమానులు.
మహేష్ బాబు, సమంత జంటగా నటిస్తున్న దూకుడు చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్నాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్, షాయాజీ షిండే, నాజర్, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ, చంద్రమోహన్, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తుండగా...థమన్, కె.వి. గుమన్, గోపీ మోహన్, కోన వెంకట్, కోటి పరుచూరి, ఎ.ఎస్. ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, రామజోగయ్య శాస్త్రీ, భాస్కరభట్ల, విశ్వ సాంకేతిక నిపుణులు.


Click it and Unblock the Notifications











