Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేష్ దూకుడు మొదలైందా...ఎలా ఉంది పోస్టర్...అదుర్స్
టాలీవుడ్ లో మరో సంచలనానికి తెర లేచింది. డేరింగ్ అండ్ డాషింగ్" హీరో మహేష్ 'దూకుడు" కి మొదటి అడుగు పడింది. అతి త్వరలో వెండితెరపై తన 'ఖలేజా" చూపనున్న ప్రిన్స్ మహేష్ అక్టోబర్ ప్రథమార్థం నుంచే 'దూకుడు" షూటింగ్ లోకి ఎంటర్ కాబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో సూపర్ కమర్షియల్ డైరెక్టర్ శ్రీను వైట్ల చెయ్యనున్న ఈ చిత్రంలో 'ఏమాయ చేశావె" ఫేం సమంతా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తోన్న ఈ 'దూకుడు"ని 16రీల్స్ బేనర్ పై రామ్ అచంట, గోపిచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
కాగా గుజరాత్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ ఎడ్వంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం ఓ వైపు శ్రీనువైట్ల కొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేస్తుంటే..మరోవైపు మహేష్ కోసం నమ్రత ఎక్స్ లెంట్ కాస్ట్యూమ్స్ ని సెలెక్ట్ చేసే పనిలో వున్నారు. ఆలె రెడీ పూజా కార్యక్రమాలు జరిగిన ఈ చిత్రానికి షూటింగ్ ప్రారంభోత్సవ వేడుకని నిర్వహిస్తారా లేదా అనేది ఇంకా నిర్థారణ కాకున్నా'దూకుడు" ఓపెనింగ్ ఫంక్షన్ కోసం రెడీ చేస్తోన్న పోస్టర్ గా ఓ ఫెంటాస్టిక్ డిజైన్ తో కుదిరిందని సమాచారం.