twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డ్ పై మండిపడ్డ మహేష్ బాబు

    By Srikanya
    |

    బిజినెస్ మ్యాన్ చిత్రంలో చాలా చోట్ల బీప్ శబ్దాలు వినిపిస్తాయి. అలాగే ఐటం సాంగ్ లోనూ చాలా సార్లు బ్లర్ చేసారు. దానిపై మీడియావారు మహేష్ ని అడిగితే.. అవసరం లేకుండా చాలా చోట్ల బీప్ శబ్దాలు ఇచ్చారు. చాలా చిత్రాల్లో మా సినిమాల్లో బీప్ శబ్దాలు ఇచ్చిన పదాలను వదిలేస్తున్నారు. ఎందుకనో మా సినిమా దగ్గరకి వచ్చేసరికే ఇన్ని అబ్జెక్షన్లు. అందుకే మా సినిమాలో అన్ని బీప్ లు కనపడతాయి..అంటూ ఫైర్ అయ్యారు. కొన్ని సినిమాల్లో అడల్ట్ కంటెట్ ఉన్నా వదిలేస్తూండటం గమనిస్తూంటాం. బిజినెస్ మ్యాన్ లో ఐటం గర్ల్ కాళ్లు ని కూడా బ్లర్ చేస్తారు. అలాంటప్పుడు మిగతా సినిమాల్లో క్లవరేజ్ షో లు కూడా తీసేయాలి కదా. ఇంతకన్నా దారుణంగా ఉన్న సినిమాలకు కొన్ని బీప్స్,కట్స్ తో చక్కగా ఎ సర్టిఫికేట్ ఇష్టూ చేస్తూంటారు. కొన్ని సినిమాలకే ఈ శిక్ష అన్నట్లుంటుంది.

    మహేష్ లాంటి పెద్ద హీరోల సినిమాలకే ఇలా జరిగితే మామూలు వాళ్ల పరిస్దితి ఏమిటన్నది ఇప్పుడు సినీ పెద్దలని ఆలోచనలో పడేస్తున్న ప్రశ్న. ఇక ప్రస్తుతం మహేష్ ..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. అలాగే బిజినెస్ మ్యాన్ 2 చిత్రంతో మరో సారి పూరీ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సంవత్సరం చివరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈలోగా సుకుమార్ దర్శకత్వంలో చిత్రం కూడా ఫినిష్ చేయనున్నారు.

    English summary
    Mahesh says.."We too felt that some of the beeps were unnecessary. The Censor Board allowed such kind of words in some of the films. I don't know, why they raised objection to our film. That's why, the number of beeps have increased".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X