మహేష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో చిత్రం...అల్లు శిరీష్
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కలిసి మల్టి స్టారర్ తమ గీతా ఆర్ట్ పై బాగుంటుందని అంటున్నారు అల్లు శిరీష్. ఆయన తాజాగా ట్విట్టర్ లో ఈ విషయంపై ట్వీట్ చేసారు. అలాగే మహేష్...తను మల్టి స్టార్ సినిమాలు చేయటానికి సిద్దమేనని అన్నారని అప్పుడు తాము ఎవరు ఆయన ప్రక్కన నిటించటానికి ఇష్టపడతారని అడిగమాని అన్నారు. దానికి సమాధానంగా మహేష్ తన ప్రక్కన మల్టి స్టార్ గా నటించటానికి ఐడియల్ కోస్టార్ గా నటించటానికి పవన్ కళ్యాణ్ అయితే ఇష్టపడతానని అన్నారు. ఈ కాంబినేషన్ సినిమా ప్రారంభం కావాలని తాను చాలా గాఢంగా కోరుకుంటున్నాని, అదే జరిగితే ఆ రేంజి వేరే ఉంటుందని ఉన్నారు. ఇక ప్రస్తుతం మహేష్, పవన్ ఇద్దరూ ఒకే నిర్మాత శింగనమల రమేష్..తీస్తున్న చిత్రాలు(ఖలేజా, పులి) చిత్రాలలో చేస్తున్నారు. ఇక కాంబినేషన్ ప్రారంభం కావాలని ప్రతీ తెలుగు ప్రేక్షకుడూ కోరుకుంటాడనటంతో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











