స్పెషల సెట్ లో మహేష్ బాబు...స్టైలిష్ గా
హైదరాబాద్ : 'మిర్చి'తో మాస్ ప్రేక్షకులే కాక, క్లాస్ అభిమానుల నాడిని పట్టిన దర్శకుడు కొరటాల శివ. ఈ రెండు రకాల అభిమానులను కలిగి ఉన్న హీరోమహేష్‌బాబు. వీరిద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మై త్రీ మూవీస్ పతాకంపై వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ సీఎంఆర్ నిర్మిస్తున్నారు.
https://www.facebook.com/TeluguFilmibeat
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో మహేష్‌బాబుపై పరిచయ గీతాన్ని తెరకెక్కించనున్నారు. రాజుసుందరం మాస్టర్ పాటకు నృత్య రీతులు సమకూరుస్తారు. సాంగ్ చాలా స్టైలిష్ గా ఉండనుంది. మహేష్ కెరీర్ లో ప్రత్యేకంగా ఈ పాట నిలిచిపోయేలా డిజైన్ చేసినట్లు సమాచారం.
హీరోయిన్ పూర్ణ ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది. క్లాసికల్ డాన్సర్ కోసం వెతికి చివరకు పూర్ణతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ... ఈ పాట గ్రామీణ నేపధ్యంలో వస్తుందని చెప్తున్నారు. పూర్ణ..కథక్ డాన్సర్ కావటంతో ఆమె ఫెరఫెక్ట్ గా ఆ పాటకు సూట్ అవుతుందని ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్ లో స్పెషల్ సెట్ వేయిస్తున్నారు.

ప్రిన్స్ మహేష్ అభిమానులు కూడా భారీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆగడు నిరాశని మిగల్చడంతో కొరటాల శివ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేష్ సరసన అందాల భామ శృతి హసన్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.
మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్, మాస్ కలిపిన కథలో మహేష్ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నాము అన్నారు.
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











