twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాపై కొత్త రూమర్...ఖండన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మహేష్,కొరటాల శివ చిత్రం ఎనౌన్స్ చేసిననాటి నుంచీ వరసగా టైటిల్స్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని దర్శక,రచయిత కొరటాల శివ ఖండిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న మగాడు టైటిల్ అంటూ రూమర్ వస్తే ఖండించారు. అది ముగిసేలోగానే మరో సారి రూమర్ వచ్చేసింది. అది ఈ చిత్రం టైటిల్ మా అక్క బంగారం అని, అక్క సెంటిమెంట్ చుట్టూ కథ తిరుగుతుందని, దీంతో ఇలా ప్రతీసారీ ఖండిచటం కష్టం అంటున్నారు కొరటాల శివ.

    అయినా పెద్ద హీరోతో సినిమా అన్నాక ఎన్నో రూమర్స్, వార్తలు ప్రచారంలోకి వస్తాయి. వాటినన్నిటినీ పట్టించుకుంటూ కూర్చుంటే ఎలా. ఫ్యాన్స్ కూడా అలాంటివి పట్టించుకోరు. అఫీషియల్ గా వచ్చిన వార్తలకే వారు సైతం ప్రయారిటీ ఇస్తారు. మరి ఎందుకు టెన్షన్...అనవసరంగా ఈ ఖండనలు ఎందుకు అంటున్నారు కొందరు మహేష్ అభిమానులు...సినీ పెద్దలు.

    ఇక తాజా ఖండన విషయానికి వస్తే...కొరటాల శివ "ప్రతీ సారి ఇలా రూమర్స్ ని క్లారిఫై చేయటం కష్టమే. అది నా టైటిల్ కాదు..అలాగే నా స్క్రిప్టు సిస్టర్ సెంటిమెంట్ కు చెందింది కాదు ", అన్నారు కొరటాల శివ. అలాగే... నవంబర్ మొదటి వారం నుంచీ తన చిత్రం షూటింగ్ మొదలవుతుందని, అభిమానులను కాస్త ఓపికగా వెయిట్ చేయమని ఆయన అన్నారు.

    Mahesh's 'Ma Akka Bangaram' A Rumor

    శ్రుతి హాసన్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. నవంబరు 3 నుంచి మహేష్‌బాబు షూటింగ్‌లో పాల్గొంటారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్‌బాబు శైలికి తగిన కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించే బాణీలు ఆకట్టుకొంటాయని నిర్మాతలు చెప్తున్నారు.

    మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

    నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

    English summary
    "It's becoming tough to clarify rumors every time. It's not my title and my script is about sister sentiment", said Koratala. He clarified that shooting of his second flick will kick start from 1st week of November before requesting fans to stay patient for further updates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X