మహేష్ బాబు ‘మహర్షి’ రిలీజ్ డేట్ మారిందా? క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మహర్షి' గురించి గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా ఔట్ పుట్ మీద మహేష్ బాబు అసంతృప్తిగా ఉన్నారని, సినిమా రీ షూట్ చేస్తున్నారని, ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 25న ఈ చిత్రం రావడం లేదనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
'మహర్షి' మూవీ వాయిదా పడిందనే వార్తల నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అపీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా అభిమానుల్లో నెలకొని ఉన్న డౌట్స్ క్లియర్ చేశారు.

రిలీజ్ డేట్ గురించి దిల్ రాజు
‘మహర్షి' చిత్రం ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు కొన్ని రోజుల క్రితేమ ప్రకటించారు. తాజాగా మరోసారి అదే విషయం స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. సినిమాను ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేసి తీరుతామని తెలిపారు.

షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది?
మార్చి 15వ తేదీతో 2 పాటలు మినహా షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని దిల్ రాజు వెల్లించారు. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టడంతో పాటు మిగతా 2 పాటల చిత్రీకరణ ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీగా ‘మహర్షి' చిత్రం తెరకెక్కుతోంది. సినిమా మొదలవ్వడానికి రెండేళ్ల ముందే ఈ కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు.. సూపర్ స్టార్ డేట్స్ కోసం సుధీర్ఘకాలం వెయిట్ చేసి మరీ ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో వచ్చిన ది బెస్ట్ మూవీగా ఇది ఉండబోతోందట.

భారీ అంచనాలు
‘భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత మహేష్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











