తొందరెందుకు...అధికారికంగా ప్రకటిస్తాం కదా
హైదరాబాద్: పెద్ద హీరోల సినిమాలు మొదలవుతున్నాయంటే ఆ చిత్రం టైటిల్ ఫలానా...కావచ్చు అంటూ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేఫధ్యంలో అభిమానులు ఎక్కడ మిస్ లీడ్ అవుతారనో అనే భయంతో వెంటనే దర్శక,నిర్మాతలు ఖండనలు ఇస్తున్నారు. తాజాగా మహేష్ సినిమాకు అదే పరిస్ధితి వచ్చింది.
మహేష్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మగాడు అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ టైటిల్ ని తాము అనుకోలేదని, తాము ఓ టైటిల్ ని ఖరారు చేసిన తర్వాత అథికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇంతవరకు మేం టైటిల్‌ను నిర్ణయించలేదు. మేం అనుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం. మా బ్యానర్‌లో తొలి చిత్రమే మహేశ్‌గారితో చేయడం మా అదృష్టం. సినిమాను భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మహేష్‌గారి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది'' అని తెలిపారు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో జరగనుంది. శ్రుతిహాసన్ ఇందులో మహేశ్‌తో జోడీ కడుతోంది. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేశ్ రుషి, సంపత్, సుబ్బరాజు, తులసి ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: మది, థ్రిల్స్: అనల్ అరసు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అశోక్‌కుమార్ రాజు.ఎం., చంద్రశేఖర్ రావిపాటి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.


Click it and Unblock the Notifications











