మహేష్ బాబు సెంటిమెంట్ ప్రకారమే.....
హైదరాబాద్ : వచ్చే సంక్రాంతికి మురిపించడానికి ఇప్పుడే రంగం సిద్ధం చేసుకొంటున్నాడు మహేష్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ఉపశీర్షిక. కృతి సనన్ కథానాయిక. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
మహేష్ బాబు కి సంక్రాంతి సెంటిమెంట్ కు బాగా ఫిక్సై నట్లున్నాడు. ఈ ముగ్గుల పండక్కి.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో సందడి చేశాడు మహేష్‌బాబు. అందులో చిన్నోడి పాత్ర ఇంకా మన కళ్లముందు కదులుతూనే ఉంది. గత సంక్రాంతికి బిజినెస్ మ్యాన్ వచ్చి హిట్టైంది. మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక్కడు చిత్రం కూడా సంక్రాంతి విడుదల కావటం గమనార్హం. ఈ నేపధ్యంలో మహేష్ కి సంక్రాంతి బాగా కలిసివస్తుందనే సెంటిమెంట్ తోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసాడంటున్నారు.
ఇక ప్రస్తుతం ఆ రికార్డులన్నింటినీ మహేష్‌బాబు '1' 'నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు.
''మహేష్‌బాబు అభిమానుల్ని మురిపించే సినిమా ఇది. వారి అంచనాలకు తగినట్టే ఉంటుంది. ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా రెండో ప్రచార చిత్రం విడుదల చేశాం. తొలి మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం'' అని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్.రత్నవేలు, పోరాటాలు: పీటర్ హెయిన్స్.


Click it and Unblock the Notifications











