Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన సరిలేరు.. ఈ ఘనత సాధించిన ఏకైక హీరో మహేశ్ బాబే.!
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల హవా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా వాటి గురించే చర్చించుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలపై క్రేజ్ భారీగా పెరిగిపోయింది. వీటిలో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు'పై అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఈ మూవీని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించడం.. రెండోది మహేశ్ బాబు చాలా రోజుల తర్వాత మాంచి కమర్షియల్ సినిమాలో నటించడం. అందుకే ఈ సినిమా కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం.. బాహుబలి రికార్డును సరిలేరు బద్దలు కొట్టేసింది. ఇంతకీ ఏంటా రికార్డ్.? వివరాల్లోకి వెళితే...
మహేశ్ బాబు సరిలేరు అనిపించుకుంటాడా.?
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - మహేశ్ బాబు కాంబోలో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. దిల్ రాజు, అనిల్ సుంకరతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. అలాగే, ఇందులో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, కౌముది, ఆద్య తదితరులు కీలక పాత్రలు చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
అన్ని చోట్లా మహేశ్ మేనియానే కనిపిస్తోంది
సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయన నటించిన ‘సరిలేరు నీకెవ్వరు' ఎన్నో అంచనాల నడుమ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, బెంగళూరు, చెన్సై సహా ఎన్నో ప్రాంతాల్లో మహేశ్ మేనియా కనిపిస్తోంది.
మహేశ్ అభిమానులకు పండుగలా ఉంది
భారీ అంచనాల నడుమ శనివారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్టాఫ్ అదిరిపోయిందని, కాకపోతే ద్వితీయార్థంలో సినిమా కొంచెం నెమ్మదించిందని సినీ విమర్శకులు చెబుతున్నారు. మొత్తంగా ఈ సినిమాలో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆశించిన అన్ని అంశాలు ఉండడంతో వాళ్లకు బాగా నచ్చుతుందని చెబుతున్నారు.
కలెక్షన్ల పరంగానూ దుమ్ముదులుపుతోంది
సరిలేరు నీకెవ్వరు మనకంటే ముందే ఓవర్సీస్లో విడుదలైంది. అక్కడ దాదాపు 250 పైచిలుకు స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేశారు. వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. టికెట్లు ఆన్లైన్లో పెట్టిన గంటల్లోనే హౌస్‌ఫుల్ అయిపోయాయి. మొత్తంగా ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా హాఫ్ మిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలుస్తోంది. అక్కడ ఈ మూవీ టికెట్ 21 డాలర్లు కావడం విశేషం.
బాహుబలి రికార్డు బద్దలు కొట్టిన సరిలేరు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శనివారం విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా నెల్లూరు సిటీలో ఏకంగా 82 స్క్రీన్లలో విడుదలైంది. అది కూడా అన్ని చోట్ల హౌస్‌ఫుల్ అయిపోయింది. తద్వారా ఇప్పటి వరకు ‘బాహుబలి' పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేసింది.
ఈ ఘనత సాధించిన ఏకైక హీరో మహేశ్ బాబే.!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్క హైదరాబాద్ మినహా ఏ సిటీలోనూ ఇన్ని స్క్రీన్లలో విడుదలైన సినిమా లేదు. ఈ ఘనత మహేశ్ బాబు ఒక్కడికే సాధ్యం అయింది. గతంలో చాలా సినిమాలు భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఇన్ని స్క్రీన్లలో విడుదల కాలేదు. ప్రస్తుతం మల్టీఫ్లెక్స్‌లు ఎక్కువగా ఉండడం వల్లే ఈ రికార్డు సాధ్యం అయిందన్న టాక్ వినిపిస్తోంది.