‘1 నేనొక్కడినే’పంక్షన్ లో మహేష్ స్పీచ్(ఫొటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్ :''నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని... అభిమానంతో ఆదరిస్తున్న మీ రుణం తీర్చుకోలేనిది. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను. చేతులెత్తి నమస్కరించడం తప్ప'' అని అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ఉద్వేగంగా మాట్లాడారు.

మహేష్ బాబు హీరోగా నటించిన '1' పాటల విడుదల వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందించారు.

విశాఖపట్నం, కర్నూలు, వరంగల్‌, రాజమండ్రి, విజయవాడలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి చేతుల మీదుగా పాటల్ని విడుదల చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, సూపర్‌స్టార్ కృష్ణ, జి.ఆదిశేషగిరిరావు, నమ్రత, బోయపాటి శ్రీను, సుధీర్‌బాబు, లహరి మ్యూజిక్ మనోహర్‌నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆడియో పంక్షన్ విశేషాలు...

ఎవరి చేతులు మీదుగా...ఎవరు?

ఎవరి చేతులు మీదుగా...ఎవరు?

‘1 నేనొక్కడినే' ఆడియో సీడీని మహేష్‌ తనయుడు గౌతమ్‌ కృష్ణ విడుదల చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల అందుకున్నారు.

టెన్షన్ లో చెప్పారు

టెన్షన్ లో చెప్పారు

''బిజినెస్‌మేన్‌' చిత్రీకరణ గోవాలో జరుగుతున్న సమయంలో సుకుమార్‌ '1' కథ చెప్పారు. అయితే టెన్షన్‌లో సరిగా చెప్పలేకపోయారు. సినిమా చేద్దాంలే అన్నాను. 30 నిమిషాల తర్వాత ఉద్వేగంతో ఆయనకి మళ్లీ ఫోన్‌ చేసి మాట్లాడాను. కథ చాలా బాగుందన్నాను'' అన్నారు మహేష్ బాబు.

హ్యాట్సాఫ్

హ్యాట్సాఫ్

''సుకుమార్‌ ఆలోచనలకు హ్యాట్సాఫ్‌. నేను, దేవిశ్రీప్రసాద్‌ కలిసి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. కానీ కుదర్లేదు. ఈ సినిమా ద్వారా కుదిరింది''అన్నారు మహేష్‌బాబు.

గౌతమ్ కి ఏమీ చెప్పలేదు...

గౌతమ్ కి ఏమీ చెప్పలేదు...


''నా చిన్నతనంలో సెలవు రోజుల్లో సినిమాల్లో నటించేవాడిని. అప్పుడు నాన్న నాకు నటన గురించి ఏమీ చెప్పలేదు. నాకు తెలిసినట్లు నేను నటించాను. ఇప్పుడు కూడా గౌతమ్‌ తన సెలవుల్లో వచ్చి ఈ సినిమాలో నటించాడు. ఇప్పుడు నేను కూడా గౌతమ్‌కి ఏమీ చెప్పలేదు అని మహేష్ చెప్పారు.

అందుకునే వాళ్ళతో చేస్తున్నా...

అందుకునే వాళ్ళతో చేస్తున్నా...

'దూకుడు' సినిమాలో ఈ నిర్మాతలతో పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అందుకే వెంటనే వాళ్లతోనే '1', 'ఆగడు' సినిమాలు చేస్తున్నాను. వాళ్లతో పని చేయడం అంటే కుటుంబ సభ్యులతో పని చేసినట్లే'' అన్నారు.

'హూ ఆర్‌ యూ' ...

'హూ ఆర్‌ యూ' ...

'హూ ఆర్‌ యూ' అని అడిగితే మీరేమంటారు.. అని వ్యాఖ్యాత మహేష్‌ని అడిగితే 'నేను కృష్ణగారి అబ్బాయి మహేష్‌ని' అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చి కృష్ణ గారి ఫ్యాన్స్ ని ఆనందపరిచారు.

కళ్ళతో చూసిన వాడ్ని..

కళ్ళతో చూసిన వాడ్ని..

సుకుమార్ ఐడియాస్ సూపర్బ్. మూడేళ్లు ఈ సినిమాకోసం ఆయన పడ్డ కష్టం కళ్లతో చూసిన వాణ్ణి. చాలాకాలంగా దేవిశ్రీ, నేనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. సుకుమార్ కారణంగా మా కలయిక కుదిరింది అని మహేష్ అన్నారు.

బిల్డింగుల మీదనుంచి దూకించేశారు

బిల్డింగుల మీదనుంచి దూకించేశారు

పీటర్‌హేన్స్ ఈ సినిమాలో నాతో పెద్ద పెద్ద సాహసాలే చేయించారు. బిల్డింగుల మీదనుంచి దూకించేశారు అంటూ పీటర్ హెయిన్స్ కు ధాంక్స్ చెప్పారు మహేష్.

ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది.

ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది.

నేను డాన్సులు చేయడం లేదని అభిమానుల్లో ఓ బాధ ఉంది. ఆ బాధను ఈ సినిమా తీర్చేస్తుంది. మరో సినిమా ఒప్పుకోకుండా రెండేళ్లు మాతో ఉండి అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు కెమెరామేన్ రత్నవేలు.

అది వాడి ఫీలింగ్...

అది వాడి ఫీలింగ్...

ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఈ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. టోటల్‌గా నా కెరీర్‌లోనే బెస్ట్ మూవీ ఇది అని నమ్మకం వ్యక్తం చేశారు మహేష్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X